రోడ్లు, కాలనీలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలి: డిప్యూటీ కమిషనర్ శశిరేఖ

శేరిలింగంపల్లి, ఫిబ్ర‌వ‌రి 11 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): GHMC మియాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ అధ్యక్షతన పారిశుధ్య విభాగం సమీక్షా సమావేశం నిర్వహించారు. సర్కిల్ పరిధిలోని రోడ్లు, కాలనీలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేట్లు చూసుకోవాలని, కాలనీలలో పారిశుధ్య పనులు చేయాలని, చెత్తను ఎవరూ బయట వేయకుండా, రోజూ ఆటోల‌కు అందించే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. సర్కిల్ లోని అన్నపూర్ణ క్యాంటీన్ ల పరిసరాలు శుభ్రంగా ఉండేట్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. చెత్త ఆటోలు ఎప్పటికప్పుడు చెత్తను ఇండ్ల నుండి, వాణిజ్య సముదాయాల నుండి తీసుకువెళుతున్నారా లేదా రోజూ తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి షాప్, అపార్ట్మెంట్, స్ట్రీట్ వెండార్స్, కార్యాలయాలు, ప్రార్టనా మందిరాలు తప్పనిసరిగా రెండు డస్ట్ బిన్ లు పెట్టుకునే విధంగా చూసుకోవాలని, ఆటోకు చెత్తను అందించే విధంగా చూడాలని అన్నారు. చెత్తను రోడ్ల పైన వేసే వారిని గుర్తించి GHMC యాప్ ద్వారా పెనాల్టీ చ‌లాన్ లు వేసి కట్టడి చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సర్కిల్ పారిశుధ్య అధికారి డీఈ వశీధర్, ఏఈ నిఖిల్, ఎస్ఎస్ శ్రీనివాస్, జవాన్ లు, Srp లు, Sfa లు, రాంకీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here