శాశ్వత పరిష్కారం దిశగా కైదమ్మ కుంట చెరువు అభివృద్ధి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 29 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని కైదమ్మ కుంట చెరువు సుందరీకరణలో భాగంగా Nexus select Malls కంపెనీ CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలో భాగంగా సుందరీకరణ, పునరుద్ధరణ పనులను ఇరిగేషన్, జలమండలి, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులు, సీనియర్ నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ కైదమ్మ కుంట చెరువు దశ దిశ మారుతుంద‌ని అన్నారు. వర్షాకాలం లోపు పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. కైదమ్మ కుంట చెరువుకు నేటితో దశ దిశ మారింద‌ని, ఎన్నో ఏండ్ల సమస్య నేటితో తీరుతుంద‌ని, శాశ్వత పరిష్కారం దిశగా చెరువును అభివృద్ధి చేపట్టడం జరిగింద‌ని, మురికి కూపంలాంటి చెరువును స్వచ్చమైన మంచి నీరు లాంటి చెరువుగా తీర్చిదిద్దాడమే ధ్యేయంగా పని చేసి నిరూపించడం జరుగుతుంద‌ని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE రాజశేఖర్, AE గులాం మొయినుద్దీన్, GHMC అధికారులు DE శ్రీదేవి, AE ప్రతాప్, జలమండలి మేనేజర్ శ్రీహరి, CSR ఐటీ సంస్థ ప్రతినిధి చైతన్య, నాయకులు సుదేశ్, సాదిక్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here