శిల్పారామంలో అల‌రించిన నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లు

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 20 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో నవరాత్రి, బతుకమ్మ, దసరా ఉత్సవాలను, శారీస్ ఆఫ్ ఇండియా మేళాను నిర్వహించడం జరుగుతుంద‌ని నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ సంద‌ర్భంగా శ‌నివారం నిర్వ‌హించిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా భరతనాట్యం, ఒడిసి నృత్య ప్రదర్శన ఎంతగానో అలరించింది. సస్మితా మిశ్రా శిష్య బృందం ఒడిస్సీ నృత్య ప్రదర్శనలో శుక్లాం భ‌ర‌ద‌రం, నాగేంద్ర హారయా, శంకరాభరణం పల్లవి, శ్రీ హరి స్తోత్రం, బట్టు, బసంత్ పల్లవి, మాతంగి, మోక్ష మొదలైన అంశాలను దివ్యశ్రీ , ఆర్వీ, ధన్వి, వన్య, అన్విక, శుభశ్రీ, అంకిత, ఐశ్వర్య, ప్రియ ప్రదర్శించి మెప్పించారు. తనుశ్రీ బైనిక్ శిష్య బృదం భరతనాట్య ప్రదర్శనలో ఓం హరీం, నటేశ కౌతం, అయిగిరినందిని, ఓం జయంతంగ్ దేవి చాముండే , వినాయక కౌతం, పుష్పాంజలి, భైరవి శతకం, అగ్నికన్య, అంశాలను సానియా, సేజల్, వామిక, ద్యుతి, నవ్య, డివిలీన్, ఓజస్విత, నిరవి ప్రదర్శించి మెప్పించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here