శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (నమస్తే శేరిలింగంపల్లి): బీజేవైఎం కొండాపూర్ డివిజన్ అధ్యక్షుడిగా గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ నియమితులయ్యారు. బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ , కంటెస్టెడ్ ఎమ్మెల్యే రవి కుమార్ యాదవ్ చేతుల మీదుగా సుకుమార్ పటేల్ నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా గుమ్మడి సాయి సుకుమార్ పటేల్ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతం ఆదర్శాలతో, నీతి, నిజయితీ, నిబద్దత, క్రమశిక్షణ , చిత్తశుద్ధితో వ్యవరిస్తానని, డివిజన్ లోని బీజేవైఎం నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతానని తెలిపారు. తనపై నమ్మకం ఉంచి తనకు బాధ్యతను ఇచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకుడు రవికుమార్ యాదవ్, గంగుల చంద్రశేఖర్ యాదవ్, గంగల రాధాకృష్ణ యాదవ్, డివిజన్ బీజేపీ అధ్యక్షుడు అరవింద్, కైతాపురం జితేందర్, బీజేవైఎం నాయకులు తోట్ల భరత్ కుమార్, పిల్లి సాయి కుమార్ , డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలా రాజేందర్ రెడ్డి, శేరి నవీన్ రెడ్డికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు అరవింద్ చక్రవర్తి , హఫీజ్ పేట్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ , కొండాపూర్ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలా రాజేందర్ రెడ్డి , బీజేవైఎం నాయకులు రాము యాదవ్, సంపత్ పాల్గొన్నారు.






