మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలల్లో మియాపూర్ డివిజన్ నుంచి తెరాస కార్పొరేటర్‌గా పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ స్థానిక టిఆర్ఎస్ నాయకుడు బీఎస్ఎన్ కిరణ్ యాదవ్ శనివారం ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి బయోడేటాను అందజేశారు. శేరిలింగంపల్లి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన తన తండ్రి బిఎస్ఎన్ యాదవ్ స్ఫూర్తితో గత రెండు దశాబ్దాలుగా మియాపూర్ రాజకీయాల్లో కొనసాగుతున్ననానని, స్థానికంగా అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు. తనకు అవకాశం కల్పిస్తే మియాపూర్ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో గెలిచి వస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ కిషోర్ యాదవ్, స్థానిక తెరాస నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.