- రూ.15 లక్షల విలువైన సెల్ఫోన్లు మాయం..?
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మదీనాగూడ రిలయన్స్ డిజిటల్ షోరూంలో భారీ చోరీ జరిగింది. మియాపూర్ పీఎస్ ఎస్ఐ రవికిరణ్ తెలిపిన వివరాల ప్రకారం.. మదీనాగూడ రిలయన్స్ డిజిటల్ షోరూంలో గుర్తుతెలియని వ్యక్తులు షెటర్లను ధ్వంసం చేసి పైకి ఎత్తారు. లోపలికి ప్రవేశించిన దుండగులు భారీ ఎత్తున సెల్ఫోన్లను దోచుకెళ్లారు. పోయిన సొత్తు విలువ సుమారుగా రూ.15 లక్షల వరకు ఉంటుందని షోరూం నిర్వాహకులు తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మియాపూర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు.