శేరిలింగంపల్లి, అక్టోబర్ 6 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ లో దసరా పర్వదినం సందర్భంగా శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో విశేష అలంకరణలో పూజలు అందుకుంటున్న దుర్గాదేవి అమ్మవారి మండపంలో జరిగిన పూజ కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రి వేడుకలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని గాంధీ ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో సుప్రజ ప్రవీణ్, ప్రసాద్, రామరాజు, రవీందర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, దాస్ తదితరులు పాల్గొన్నారు.