- కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే మహోన్నత కార్యక్రమంలో భాగంగా తెరాస ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు మెరుగైన సేవలు కల్పిస్తోందని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు. కొండాపూర్ డివిజన్ పరిధిలోని మై హోం భుజ, రహేజా మైండ్ స్పేస్, సౌరవ్ మిశ్రా, పాన్ మక్తా, జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ ల వద్ద జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్లను కార్పొరేటర్ హమీద్ పటేల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస అధ్యక్షుడు అబ్బుల కృష్ణగౌడ్, వార్డు మెంబర్ జంగం గౌడ్, ఏరియా కమిటీ మెంబర్ తిరుపతి యాదవ్, జనరల్ సెక్రటరీ పేరుక రమేష్ పటేల్, సెక్రటరీ జె బలరాం యాదవ్, యూత్ నాయకుడు దీపక్, జీహెచ్ఎంసీ సిబ్బంది పాల్గొన్నారు.