గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నేతాజీ నగర్ లో రూ.50 లక్షల నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీలో సీసీ రోడ్లు నిర్మిస్తున్నందుకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ, కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాలకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు ఎండీ కమర్ పాషా, రాంబాబు నాయక్, ఏఈ కృష్ణవేణి, డీఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.