ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): పేద మహిళలకు చేయూతనివ్వాలనే ఉద్దేశ్యంతో హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండా విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన పేద మహిళలు రమ, శైలజ, చంద్రకళ, రమలకు ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ చేతుల మీదుగా శుక్రవారం కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. అలాగే ఆల్విన్ కాలనీ డివిజన్ జయశంకర్ కాలనీకి చెందిన పుష్ప కుటుంబానికి రూ.5వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. పేద ప్రజలకు చేయూతను అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. హోప్ ఫౌండేషన్ నిరంతరాయంగా సేవలను అందిస్తుండడం గొప్ప విషయమన్నారు. సమాజంలోని తోటి వారికి చేయూతను అందించాలనే గొప్ప మనస్సును కలిగి ఉండడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, చందానగర్ డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, తెరాస నాయకులు వాలా హరీష్ రావు, లక్ష్మారెడ్డి, అష్రాఫ్, మున్నా షాకత్ అలీ పాల్గొన్నారు.