ఆశ్లీల, విష సంస్కృతిపై పోరాడుదాం: కన్నం వెంకన్న

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): నేటి సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఆశ్లీల, విష సంస్కృతిపై ప్రతి ఒక్కరు పోరాడాలని యూపీఎన్ఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కన్నం వెంకన్న అన్నారు. మియాపూర్ స్టాలిన్ నగర్ లో జరిగిన ఐక్య ప్రజానాట్యమండలి (UPNM) విస్తృత సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజ‌రై మాట్లాడుతూ సాంకేతిక అభివృద్ధి అవుతున్నదని సంబరపడుతున్న ప్రస్తుత సమయంలో యువత భవితను నిర్వీర్యపరిచే విధంగా సోషల్ మీడియా వేదికగా ముఖ్యంగా వివిధ వెబ్ సైట్లలో ఆశ్లీల దృశ్యాలు, సినిమాలు పెరిగిపోతున్నాయని, దీనివలన సమాజంలో మహిళలపైన, చిన్నారుల పైన అత్యాచారాలు, హింస పెరుగుతున్నాయని అన్నారు.

స‌మావేశంలో మాట్లాడుతున్న క‌న్నం వెంక‌న్న

సమాజాన్ని, ప్రజలను విష సంస్కృతి మరింత దిగజార్చే విధంగా ఉందని వీటికి వ్యతిరేకంగా కళా రంగాల‌ ప్రజలు పోరాడాలని అన్నారు. యూపీఎన్ఎం ఆధ్వర్యంలో ప్రజల్ని చైతన్యం చేసే కార్యక్రమాలను తీసుకొచ్చేందుకు ఈ సమావేశం తగిన నిర్ణయం చేసిందని తెలియజేశారు. కళా రంగాలలో వివిధ రూపాలలో శిక్షణ తరగతులు నిర్వహించాలని సమావేశం నిర్ణయించినట్లు తెలియజేశారు. యూపీఎన్ఎం రాష్ట్ర అధ్యక్షుడు మైదం శెట్టి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వనం సుధాకర్, తుడుం అనిల్ కుమార్, వై.రాంబాబు, ఎం.రాజు, గూడ లావణ్య, ధారా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here