చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని సిటిజెన్ కాలనీలో రూ.18 లక్షల జీహెచ్ఎంసీ నిధులతో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను కాలనీ వాసులతో కలసి కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ సిటిజెన్ కాలనీలో రోడ్లు గుంతలు పడ్డాయని, దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ మేరకు తనకు స్థానికులు ఫిర్యాదు చేశారని, అందుకనే సీసీ రోడ్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మొయిజ్, గౌస్, వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు.