చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలో నిధులు మంజూరై ప్రారంభోత్సవం చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఈఈ చిన్నారెడ్డిని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనను ఆయన కార్యాలయంలో కార్పొరేటర్ కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ కాలనీ, జవహర్ కాలనీ, శ్రీ శంకర్ నగర్ కాలనీ, విద్యా నగర్, గౌతమి నగర్ కాలనీ, కైలాష్ నగర్ కాలనీ, శ్రీ రాం నగర్ కాలనీ, రాజేందర్ రెడ్డి కాలనీ, వేమన వీకర్ సెక్షన్, భవాని వీకర్ సెక్షన్, ఇందిరా నగర్ బస్తి, హుడా ఫేజ్స్ 2 కాలనీలలో సీసీ రోడ్లు నిర్మించడానికి నిధులు మంజూరయ్యాయని, అందువల్ల పనులను త్వరగా మొదలు పెట్టి పూర్తి చేసి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు.