గచ్చిబౌలి (నమస్తే శేరిలింగంపల్లి): అక్టోబర్ 21వ తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సైబరాబాద్ పోలీస్, సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్‌సీఎస్‌సీ) ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దాతలు పెద్ద సంఖ్యలో హాజరై రక్తదానం చేయాలని కమిషనరేట్ పోలీసులు కోరారు.