భారీ వ‌ర్షాల‌కు ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి: భేరి రామచందర్ యాదవ్

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు భేరి రామచందర్ యాదవ్ అన్నారు. గ‌చ్చిబౌలి డివిజ‌న్ ప‌రిధిలోని నేతాజీన‌గ‌ర్ కాల‌నీకి ఆనుకుని ఉన్న న‌ల్ల‌గండ్ల చెరువును మంగ‌ళ‌వారం ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. న‌ల్ల‌గండ్ల చెరువు భారీ వ‌ర్షానికి పొంగి పొర్లుతుంద‌ని, క‌నుక నేతాజీన‌గ‌ర్ వాసులు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని అన్నారు.

న‌ల్ల‌గండ్ల చెరువు వ‌ద్ద నీటి ప్ర‌వాహాన్ని ప‌రిశీలిస్తున్న భేరి రామచందర్ యాదవ్

తుఫాన్ కారణంగా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయ‌ని, నల్లగండ్ల చెరువు పొంగిపొర్లుతోంద‌ని, కాలనీలో లోతట్టు ప్రాంతాలలో భారీ వర్షానికి ఇండ్లలోకి నీళ్లు వ‌స్తున్నాయ‌ని అన్నారు. కాలనీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలకు హెచ్చరికలు చేశారు. ముంపుకు గురైన ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిన్నపిల్లలను బ‌య‌ట‌కు రానివ్వ‌వ‌ద్ద‌ని, మ‌రో రెండు మూడు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలియజేస్తుంది క‌నుక‌ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

ప్ర‌జ‌ల‌కు హెచ్చ‌రిక‌లు చేస్తున్న భేరి రామచందర్ యాదవ్

భేరి రామ‌చంద‌ర్ యాద‌వ్ వెంట కాలనీ అసోసియేష‌న్‌ ఉపాధ్యక్షుడు రాయుడు, టి కుమార్ ముదిరాజ్, అశోక్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు చెన్నం రాజు, నారాయణ, రవి నాయక్, యువజన నాయకులు పంతం శీను, భువన్ రాజు, వెంకటేష్ త‌దిత‌రులు ఉన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here