నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేయడం టీఆర్ఎస్ ప్రభుత్వం పిరికిపంద చర్య అని బిజెపి శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జీ గజ్జల యోగానంద్ ఎద్దేవా చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్ కి వ్యతిరేకంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ బిజెపి అధ్వర్యంలో శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు రాజు శెట్టి కురుమ అధ్యక్షతన లింగంపల్లిలోని ఆదర్శ్ నగర్ లో నల్ల బ్యాచిలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా గజ్జల యోగానంద్ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం కబ్జాలకు, లూటీలకు, దోపిడీలకు, స్కాంలకు పెట్టింది పేరన్నారు. తప్పు చేసిన కవితని వదిలేసి శాంతి యుతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను, బిజెపి నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అక్రమాలను అడిగిన జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి పై టీఆర్ఎస్ గుండాలు దాడి చేసి కొట్టడం కేసీఆర్ రజాకార్ బుద్ధికి, అసహనానికి నిదర్శనం అన్నారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతి బాగోతాలు, టీఆర్ఎస్ ప్రభుత్వ పరిపాలన లోపాలను బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారనే భయంతోనే పాద యాత్రని ఎలాగైనా ఆపాలని అరెస్ట్ లు, దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
నక్సలైట్స్, టెర్రరిస్టులతోనే పోరాడిన బిజెపికి దాడులు కొత్త ఏం కావని, తాటాకు చప్పుళ్లకు బిజెపి కార్యకర్తలు భయపడరని, ఇలాగే దాడులకు పాల్పడితే ప్రతి దాడులు తప్పవని హెచ్చరించారు. బిజెపి కార్యకర్తల పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎలాంటి షరతులు లేకుండా ఎత్తివేయాలని లేదంటే రాబోయే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని ద్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కాంచన కృష్ణ, ఎం. అనిల్ గౌడ్, బొబ్బ నవత రెడ్డి, ఆంజనేయులు, జీ. రాంరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వెలగ శ్రీనివాస్, కే. జితేందర్, హరికృష్ణ, శాంతి భూషణ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, రాకేష్ దూబే, బీమని విజయ లక్ష్మి, సత్య కుర్మా, పి. శ్రీనివాస్, లలిత, బాలరాజు, సైఫుల్లా ఖాన్, శివ కుమార్ వర్మ, బి. సత్య నారాయణ, చంద్ర మోహన్, శివ గౌడ్, సి. సత్య నారాయణ, కిషన్ సుతర్, బొట్టు కిరణ్, అసెంబ్లీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.