నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక చింతన అవసరమని, దైవ దర్శనం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయినగర్ లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ కాశీ అన్నపూర్ణ సహిత నవగ్రహ ప్రతిష్ట మహా కుంభాభిషేక మహోత్సవ కార్యక్రమంలో మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, సాయి నగర్ వాసులు సహదేవ్, గణపతి, ఫణి కుమార్, గోపాల్, జైపాల్, రాహుల్, ప్రేమ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.