తాండ్రకుమార్ జ్ఞాపకార్థం భారీ స్మారక‌‌ స్థూపం – శంకుస్థాపనలో ఎంసీపీఐయూ రాష్ట్ర నేతలు

నమస్తే శేరిలింగంపల్లి: ఎంసీపీఐయూ పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర కార్యదర్శి కామ్రెడ్ తాండ్ర కుమార్ పేదల‌ కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ వల్లేపు ఉపేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల మృతిచెందిన కామ్రేడ్ తాండ్ర కుమార్ జ్ఞాపకార్థం ఎంసీపీఐయూ ‌ఎయిర్ టెల్ హైదరాబాద్ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న 51 అడుగుల భారీ స్మారక స్థూపానికి బుధవారం ఉపేందర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండ్ర కుమార్ ప్రజల కోసం పోరాడిన చరిత్ర కలిగిన ప్రజల మనిషి అని అన్నారు. ఆయన చరిత్రను నిలబెట్టడం పార్టీ బాధ్యతగా చారిత్రకమైన జ్ఞాపకార్థంగా ఎంసీపీఐయూ ఆధ్వర్యంలో భారీ స్థూప నిర్మాణం చేస్తున్నామన్నారు. 35 సంవత్సరాల కమ్యూనిస్టు రాజకీయ ప్రస్థానంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అనేక ఒడిదుడుకులను, ఎన్నో పోరాటాలు, నిర్భందాలతో గడిపారని చెప్పారు. తాండ్ర కుమార్ పేద ప్రజల గుండెల్లో చిరస్మరణీయునిగా నిలిచారని అన్నారు. గ్రామాల్లో నుంచి పొట్ట చేత పట్టుకొని పట్టణ ప్రాంతానికి వచ్చిన ప్రజలను సమీకరించి ప్రభుత్వ భూములను పంచి అనేక బస్తీలను ఏర్పాటు చేసిన చరిత్ర తాండ్ర కుమార్ దేనని చెప్పారు. ఎంసీపీఐయూ సైద్ధాంతిక, రాజకీయ, నిర్మాణ విధానాన్ని అమలు పరచడంలో, పార్టీని నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అన్నారు. ఈ స్థూపం నిర్మాణం రేపటి తరాలకు చారిత్రాత్మకంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, గ్రేటర్ హైదరాబాద్ కార్యదర్శి వి. తుకారం నాయక్, కామ్రేడ్ తాండ్రకుమార్ భార్య తాండ్ర కళావతి, కుమారుడు తాండ్ర రమేష్ లతోపాటు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం సుకన్య, వనం సుధాకర్, రాష్ట్ర కమిటీ సభ్యులు మైదం శెట్టి రమేష్, టి అనిల్ కుమార్, పుష్ప, పల్లె మురళి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి భద్రభోని పురుషోత్తం,గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పి భాగ్యమ్మ, డి. మధుసూదన్, మియాపూర్ డివిజన్ కార్యదర్శి కన్న శ్రీనివాస్, డివిజన్ కమిటీ సభ్యులు యన్.గణేష్, శంకర్, రతన్ నాయక్, కే రాజు రంగస్వామి, ఎం రాణి, లక్ష్మి, లావణ్య, విమల, సుల్తానా బేగం, శివాని, ఇంద్ర, అమీనా, దశరథ్ నాయక్, రవి, నాగభూషణం, ఆకుల రమేష్, కుటుంబ సభ్యులు తాండ్ర సత్యనారాయణ, తాండ్ర కృష్ణ, తాండ్ర వెంకటేష్, శ్రీనివాస్, హనుమంతు, తాండ్ర వేణు, ఎల్లంకి శ్రీను, ప్రవీణ్ గౌడ్, రోహన్ తదితరులు పాల్గొన్నారు.

తాండ్ర కుమార్ జ్ఞాపకార్థం నిర్మించనున్న భారీ స్మారక స్థూపానికి శంకుస్థాపన చేస్తున్న ఎంసీపీఐయూ నేతలు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here