నమస్తే శేరిలింగంపల్లి: బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి వరకు కమిటీలను ఏర్పాటు చేసుకుని బిజెపి బలోపేతానికి సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జోనల్ ఇంచార్జీ దుగ్యాల ప్రదీప్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, రంగారెడ్డి అర్బన్ జిల్లా ఇంచార్జీ ఎండల లక్ష్మీనారాయణ సూచించారు. చందానగర్ గొల్లపల్లి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ అధ్యక్షతన శేరిలింగంపల్లి అసెంబ్లీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దుగ్యాల ప్రదీప్, ఎండల లక్ష్మీనారాయణ హాజరై మాట్లాడారు. క్షేత్ర స్థాయి నుంచే పార్టీ బలోపేతానికి పాటు పడాలని అన్నారు. ప్రతీ కార్యకర్త పార్టీకి పట్టుకొమ్మల్లాంటి వారని, కష్టపడి పనిచేస్తే భవిష్యత్తులో మంచి పదవులు దక్కే అవకాశం ఉందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలుపు లక్ష్యంగా పని చేయాలని బిజెపి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతీ డివిజన్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడాలని అని అన్నారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యవంతులుగా చేయాలని, పార్టీ పటిష్టతకు మరింత పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు జ్ఞానేంద్ర ప్రసాద్, యోగానంద్, మొవ్వ సత్యనారాయణ, రవి కుమార్ యాదవ్, నరేష్, బుచ్చిరెడ్డి, డీఎస్ఆర్ కె ప్రసాద్, అనిల్ గౌడ్, రమేష్, నాగేశ్వర్ గౌడ్, రఘునాథ్ యాదవ్, హరి ప్రియ, కుమార్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.