నమస్తే శేరిలింగంపల్లి: మహిళలు అన్ని రంగాల్లో రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూకట్ పల్లి కోర్టు జడ్జి భవాని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పీఆర్ కే చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కోటేశ్వర్ ఆధ్వర్యంలో క్రిస్టల్ గార్డెన్ లో ఘనంగా నిర్వహించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలకు సన్మానం చేసి చీరలను పంపిణీ చేశారు. కూకట్ పల్లి జడ్జి భవాని, మాదాపూర్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్, మియాపూర్ సీఐ తిరుపతి రావు చేతుల మీదుగా మహిళలకు కుట్టు మిషన్లను, చీరలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలు ఎవరిపై ఆధారపడకుండా తమ కాళ్లపై తాము నిలబడేలా ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలన్నారు. మహిళలను ప్రోత్సహిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న పీఆర్ కే చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కోటేశ్వర్ ను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం మహిళలకు తంబోలా గేమ్స్ నిర్వహించి భోజన వసతి కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ సంగారెడ్డి విద్య, ఆర్ పి ఆర్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులు, వైస్ చైర్మన్ వాణి, భాస్కర్, శ్రీకాంత్ , వినయ్, శివ, నాగరాజు, జై కుమార్, బాలయ్య, సత్యనారాయణ, శోభారాణి, రాణి, వినయ్ కుమార్, ఐ వి ఎఫ్ హైదరాబాద్ డిస్టిక్ ప్రెసిడెంట్ పసుమర్తి శ్రీనివాస్, మారం వెంకట్, నటరాజ్, సింధు, విష్ణు పాల్గొన్నారు.