నమస్తే శేరిలింగంపల్లి: హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డులో షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదానికి గురైన శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అర్థరాత్రి అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే గాంధీ హుటాహుటిన అక్కడకు చేరుకుని అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగులను రక్షించేలా తక్ష సహాయ చర్యలను ఎమ్మెల్యే గాంధీ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆయన వెంట మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, టీఆర్ఎస్ నాయకులు దామోదర్ రెడ్డి, శ్రీనివాస్, ప్రసాద్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.