నమస్తే శేరిలింగంపల్లి: అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువజన కో ఆర్డినేటర్ గా గొర్ల యశ్వంత్ రాజ్ యాదవ్ నియామకమయ్యారు. ఈ మేరకు జాతీయ యువజన విభాగం అధ్యక్షుడు ప్రదీప్ బెహెర యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా యశ్వంత్ యాదవ్ మాట్లాడుతూ అఖిల భారత యాదవ మహాసభ శత జయంతోత్సవం చేరువలో ఉన్న తరుణంలో అఖిల భారత యాదవ మహాసభ జాతీయ యువజన కోఆర్డినేటర్ గా నియమించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. యాదవ సంస్కృతిని కాపాడేందుకు తనవంతు శాయశక్తులా కృషి చేస్తానని, యాదవ యువత జాగృతి కై పనిచేస్తానని, యువత చెడు మార్గానికి దూరంగా ఉండేలా పలు కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా అమలు చేసే విధంగా కృషి చేస్తానని ఒక ప్రకటన లో తెలిపారు. తనపై నమ్మకంతో నియమించిన అఖిల భారత యాదవ మహాసభ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ఎంపి గురూజీ ఉదయ్ ప్రతాప్ సింగ్ యాదవ్, జాతీయ సీనియర్ ఉపాధ్యక్షులు సత్య ప్రకాష్ సింగ్ యాదవ్, జాతీయ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చౌదరి యాదవ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బద్దుల బాబు రావు యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ లక్ష్మణ్ యాదవ్, జాతీయ యువజన అధ్యక్షులు ప్రదీప్ బేహెర యాదవ్, కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కు ,రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఐ. రమేష్ యాదవ్ కు యశ్వంత్ రాజ్ యాదవ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.