నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ పరిసర ప్రాంతాల చాయి ప్రియులకు శుభవార్త. ఎవర్గ్రీన్ అడ్డా ఐన చందానగర్ క్రాప్రి సెంటర్లో తిరిగి చాయి సేవలు ప్రారంభమయ్యాయి. న్యూ క్యాప్రీ పేరిట ఏర్పాటైన కేఫ్‌ను చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి స్థానిక కార్పొరేటర్లు రాగం నాగేందర్ యాదవ్, వి.జగదీశ్వర్‌గౌడ్, హమీద్‌పటేల్, చందానగర్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డిలతో కలిసి గురువారం లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకప్పుడు చందానగర్ అంటే క్రాప్రీ హోటల్ గుర్తొచ్చేదని, ఎలాంటి రంగంలోని వారికైనా క్యాప్రీ ఒక ఎవర్గ్రీన్ అడ్డగా ఉండేదని పాత స్మృతులు నెమరేసుకున్నారు. తాజాగా అదే సెంటర్లో నిర్వాహకులు ఖదీర్ మిత్రబృదం న్యూక్రాప్రీ కేఫ్, రెస్టారెంట్‌ను ప్రారంభించడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఫస్ట్‌ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన క్యాప్రీ రెస్టారెంట్‌ను గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండా విజయ్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి, లక్ష్మీనారాయణ గౌడ్, జనార్ధన్‌రెడ్డి, రామస్వామి యాదవ్, హన్మంత్‌నాయక్, అక్భర్ ఖాన్, కార్తిక్ గౌడ్, కృష్ణదాస్, గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.