జమ్మి చెట్లు నాటేందుకు ఐవీఎఫ్ శ్రీకారం: శ్రీనివాస్ గుప్తా

నమస్తే శేరిలింగంపల్లి: రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ చాలేంజ్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహరం కార్యక్రమంలో భాగంగా బతుకమ్మ, దసరా పండగను పురస్కరించుకుని ప్రతి దేవాలయం ఆవరణలో జమ్మి చెట్టును నాటే యజ్ఞాన్ని చేపట్టి‌నట్లు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు ఊటుకూరి శ్రీనివాస్ గుప్తా పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ లోని శ్రీ రాం నగర్ హుడా ఫేజ్ 2 సాయిబాబా దేవాలయంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు పబ్బ మల్లేష్ గుప్త ఆధ్వర్యంలో టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, ఊటుకూరి శ్రీనివాస్ గుప్తా స్థానికులతో కలిసి జమ్మిచెట్టును నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త ఆదేశాల మేరకు గ్రామగ్రామాన, ప్రతి ఆలయంలో జమ్మి చెట్టును నాటడం జరుగుతుందని శ్రీనివాస్ గుప్తా వెల్లడించారు. 1100 ఆలయాల్లో 1100 జమ్మిచెట్లను తమవంతుగా నాటేందుకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పబ్బ శ్రీనివాస్ గుప్తా, బోరుగు జయ కృష్ణ, బోరుగు సంతోష్ కుమార్ గుప్తా, టిఆర్ఎస్ నాయకులు గురుచరణ్ దూబే, పులిపాటి నాగరాజు, ఓ.వేంకటేష్, రాజశేఖర్ రెడ్డి, రవిందర్ రెడ్డి, శ్రీరాం నగర్ కాలనీ వాసులు రఘునాథ్ రెడ్డి, డాక్టర్ నర్సింహ రాజు, శ్రీరాం ముర్తి, హుడా కాలనీ ఫేజ్ 2 కాలనీ వాసులు శ్రీనివాస్ నాయక్, సిద్ధి రాములు, రాంరెడ్డి, మదుసుదన్ రావు, హైదరాబాద్ ఐవీఎఫ్ యూత్ ప్రెసిడెంట్ నటరాజ్ గుప్త, శేరిలింగంపల్లి ఐవీఎఫ్ అధ్యక్షుడు చిన్నం సత్యం గుప్తా, శేరిలింగంపల్లి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మారం వెంకట్ గుప్తా, సందీప్ గుప్తా, నాగరాజు గుప్తా, సంపత్ గుప్తా, మహేష్ గుప్తా, వనమ శ్రీనివాస్ గుప్తా పవన్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

చందానగర్ హుడా ఫేజ్ 2 లోని సాయిబాబా దేవాలయంలో జమ్మి చెట్టు నాటుతున్న‌ ఐవీఎఫ్‌ సభ్యులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here