నమస్తే శేరిలింగంపల్లి: గులాబ్ తుఫాన్ తో కురుస్తున్న వర్షాల కారణంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఎఫ్ సీ ఐ కాలనీ లోని లోతట్టు ప్రాంతాలలో చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ సుధాంశు తో కలిసి మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు. వరుసగా మరో రెండు రోజుల పాటు కురిసే వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని కార్పొరేటర్ శ్రీకాంత్ సూచించారు. ప్రజలందరూ అత్యవసర పరిస్థితుల్లోనే అన్ని జాగ్రత్తలతో బయటకు రావాలని సూచించారు. అనంతరం మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న మెట్రో స్టేషన్ వద్ద హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు. జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీకాంతిని, డీఈ స్రవంతి, ఏఈ ధీరజ్, వర్క్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ తదితరులు ఉన్నారు.