నమస్తే శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి మాజీ ఎమ్మెల్యే యం.బిక్షపతి యాదవ్ కుమారుడు దివంగత రాజ్‌కుమార్ యాదవ్ జయంతిని పురస్కరించుకుని కొండాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో బిజెపి రాష్ట్ర నాయకులు యం.రవి కుమార్ యాదవ్ 200 మంది రోగులకు పండ్లు అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన ఆంబులెన్స్ చెడిపోవడంతో ప్రజల అవసరార్ధం తమ సోదరుడు రాజు యాదవ్ జ్ఞాపకార్థం ఆంబులెన్స్ ను బాగు చేయించి ప్రజలు వినియోగించుకునేలా చూస్తామని యం. రవి కుమార్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంట్ వరదాచారి, శేరిలింగంపల్లి డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కర్చర్ల ఎల్లేష్, మాదాపూర్ డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ రాధాకృష్ణ యాదవ్, పద్మ, మేరీ, వినీత సింగ్, అరుణ, నాగు బాయ్, రేణుక, మల్లికా మొదలగు వారు పాల్గొన్నారు.