నమస్తే శేరిలింగంపల్లి: మక్తా మహబూబ్ పేట్ ఎస్సీ బస్తీ మంచి నీటి సమస్యపై ఎట్టకేలకు జలమండలి అధికారులు స్పందించారు. బస్తీలో తాగునీటి సమస్య తీవ్రతను వివరిస్తూ స్థానిక బిజెపి నాయకులు శుక్రవారం జలమండలి జిఎం రాజశేఖర్ కు వినతి పత్రం అందించిన విషయం విదితమే. బిజెపి నాయకుల విజ్ఞప్తికి జలమండలి అధికారులు స్పందించారు. మేనేజర్ సాయిచరిత శనివారం మక్తా మహబూబ్ పేట లో పర్యటించారు. బస్తీవాసులు ఆమెకు సమస్య తీవ్రతను వివరించారు. స్థానికంగా పైప్ లైన్ వేయడానికి అనుకూలమైన మార్గాన్ని, కనెక్షన్ పాయింట్లను అధికారి పరిశీలించారు. త్వరలోనే పైప్ లైన్ పనులు పూర్తిచేస్తామని, దీంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. జలమండలి అధికారుల సత్వర స్పందనకు బిజెపి డివిజన్ అధ్యక్షుడు మాణిక్ రావు, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణ, గుండె గణేష్ ముదిరాజ్, గంగారాం మల్లేష్, రమేష్, విజేందర్, అశోక్, శేఖర్, జాజే రావు కృతజ్ఞతలు తెలిపారు.