చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ లో పెండింగ్లో ఉన్న జటిలమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మంగళవారం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ.. చందానగర్ డివిజన్ లో పెండింగ్లో ఉన్న క్లిష్టమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేయాలని కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి మంత్రికి విజ్ఞప్తి చేశారు.