నమస్తే శేరిలింగంపల్లి: గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని ఎన్ టి ఆర్ నగర్ తాజ్ నగర్ మజీద్ దగ్గర ముస్లిం మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం తరపున రంజాన్ తోఫాను స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసంలో ముస్లిం సోదర సోదరీమణులు అందరు బాగుండాలని ఉపవాస దీక్షలు చేస్తారని గుర్తు చేశారు. ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరు సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ, తరచూ చేతులను సానిటైజ్ చేసుకోవాలని, ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్, బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, విట్టల్, నగేష్, వేణు రెడ్డి, మసీదు అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ సలీం, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్దుల్ షకీల్ తదితరులు పాల్గొన్నారు.






