ఘనంగా గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు

నమస్తే శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ బిజెపి నాయకులు, మక్త మహబూబ్ పేట్ గ్రామానికి చెందిన గుండె గణేష్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు శుక్రవారం మసీదుబండలో ఘనంగా జరిగాయి. మాజీ శాసన సభ్యులు, బిజెపి సీనియర్ నాయకులు ఎం.బిక్షపతి యాదవ్, నాయకులు బోయినపల్లి వినోద్ రావుల సమక్షంలో జరిగిన ఈ వేడుకల్లో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణేష్ ముదిరాజ్ ను గజమాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీశైలం యాదవ్, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, మల్లేష్, జాజిరావు, శ్రీను, రేపన్ వెంకటేష్, రాము, చంద్రమాసిరెడ్డి, శ్రీధర్, సోను కుమార్ యాదవ్, రవీందర్ రెడ్డి, నరేష్ చారి, నారాయణ, రాజేందర్, అనూప్, హరి, ఎస్ కే బాబా, రాజు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

గుండె గణేష్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న బిక్షపతి యాదవ్, వినోద్ రావు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here