నమస్తే శేరిలింగంపల్లి: రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్ పట్టభ్రదుల ఎమ్మెల్సీ నియోజకవర్గంకు చెందిన 100 మంది గ్రాడ్యుయేట్స్ వివరాలతో కూడిన లిస్ట్‌ను ఎంపీ రంజిత్‌రెడ్డి యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కటకం రామ్ నేత, మైనారిటీ విభాగం నాయకుడు జహీరుద్ధీన్‌లు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా రంజీత్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా కీలకమని, ప్రతి ఒక్క పట్టభద్రుడు విధిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.