ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో రాంచంద‌ర్‌రావుకు ఓటెయ్యాలంటూ బీజేపీ రాష్ట్ర నాయ‌కుల ప్ర‌చారం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని మియాపూర్ బస్ డిపో ఆర్టీసీ ఉద్యోగులను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్ కలసి బీజేపీ అభ్యర్థిని రామ్‌చంద‌ర్‌రావును గెలిపించాల‌ని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జ్ఞానేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిరుద్యోగులను నట్టేట ముంచిన టిఆర్ఎస్ ప్రభుత్వానికి మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. ఇక నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వానికి ఇప్పటికీ ఒక ఆలోచన లేదని, లక్షల ఖాళీలు ఉన్నా ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో అడ్డుకుంటున్నారని విమర్శించారు. ప్రతి గ్రాడ్యుయేట్ బీజేపీ అభ్యర్థి రాంచెందర్ రావుకి ఓటు వేసి మద్దతు తెలిపాల‌ని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మణిక్ రావు, శ్రీధర్ రావు,వర ప్రసాద్, రవి గౌడ్, లక్ష్మణ్, రామకృష్ణ, విజేందర్, రఘు,అశోక్, శ్రీను మరియు తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ కార్మికుల‌ను ఓటు అభ్య‌ర్థిస్తున్న బిజెపి రాష్ట్ర కార్య‌వ‌ర్గ స‌భ్యులు జ్ఞ‌నేంద్ర ప్ర‌సాద్‌

హ‌ఫీజ్‌పేట్ డివిజ‌న్‌లో…
హ‌ఫ‌జ్‌పేట్ డివిజ‌న్ ప‌రిధిలోని జ‌న‌ప్రియ‌ నగర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో బీజేపీ సీనియర్ నాయకులతో కలసి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జ్ఞానేంద్ర ప్రసాద్, బిజెపి రాష్ట్ర ఓబిసీ మోర్చ కార్య‌వ‌ర్గ స‌భ్యులు బోయిని మ‌హేష్ గౌడ్‌లు శుక్ర‌వారం ప్ర‌చారం నిర్వ‌హించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్య‌ర్థి రాంచంద‌ర్‌రావును భారీ మెజారిటితో గెలిపించాల‌ని ప‌ట్ట‌భ‌ద్రుల‌ను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు వర ప్రసాద్, మనోహర్, రవి గౌడ్, మహేష్ యాదవ్, బాబురెడ్డి,యాదగిరి, నర్సింహా,శేఖర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, నాగేశ్వరరావు, నర్సింహా చారి, జానీ, లక్ష్మ రెడ్డి, శ్యామ్ లాల్, పెనుమాక నాయుడు,నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here