రామ్‌చంద‌ర్‌రావుకు మ‌ద్ధ‌తుగా మెట్రోరైల్‌లో బీజేవైఎం రాష్ట్ర అధ్య‌క్షుడు భానుప్ర‌కాష్ ప్ర‌చారం

న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రాంచందర్ రావుకు మద్దతుగా గురువారం బీజేవైఎం ఆద్వ‌ర్యంలో హైదరాబాద్ మెట్రో రైల్‌లో ప్రచారం నిర్వ‌హించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్‌ సహా యువ మోర్చా నాయకులు మియపూర్ మెట్రో స్టేషన్ నుండి ఎల్. బి. నగర్ స్టేషన్ వరకు ప్రయాణించి తోటి ప్రయాణికులకు ఎన్.రాంచందర్ రావు విజయం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. ఈ సంద‌ర్భంగా భానుప్ర‌కాష్ మాట్లాడుతూ ప‌ట్ట‌భ‌ద్రులు ఆలోచించి త‌మ ఓటును వినియోగించుకోవాల‌ని, కేసీఆర్ అస‌మ‌ర్థ పాల‌ను చ‌ర‌మ గీతం పాడాలంటే రామ్‌చంద‌ర్‌రావు లాంటి విజ్ఞుల‌ను పెద్ద‌ల స‌భ‌కు పంపించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంద‌న్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర నాయకులు అనంత కృష్ణ, అరుణ్ కుమార్, బండారి నవీన్, రమ్యతేజ ,హరి ప్రియ, బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమ్మరి జితేందర్, నాయకులు పవన్, వెంకట్ యాదవ్, రాజేందర్ రెడ్డి, నవీన్ రెడ్డి, ఆనంద్ కుమార్, శివ, అచ్యుత్ రెడ్డి, సాయి కుమార్ పటేల్, శ్రావణ్, అది, తిలక్, రాజు త‌దిత‌రులు పాల్గొన్నారు.

మెట్రోరైల్‌లో ప్ర‌యాణికులను ఓటు అభ్య‌ర్థిస్తున్న బీజీవైఎం రాష్ట్ర అధ్య‌క్షుడు భానుప్ర‌కాష్ త‌దిత‌రులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here