-సుబ్బారావు కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలి: భెల్ నేత్రదాన సంచాలకర్త అల్లం పాండురంగారావు
మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ఓ వృద్ధుడి నేత్రాలను కుటుంబ సభ్యులు దానం చేశారు. ఉప్పల్ కు చెందిన ఎల్.సుబ్బారావు(87) ఇటీవల ప్రమాదవశాత్తు కిందపడి గాయపడ్డాడు. కాగ ఎంఐజీ లో ఉండే ఆయన వియ్యంకుడు భెల్ మాజీ ఉద్యోగి దుర్గా ప్రసాద్ రావు సహకారంతో మదీనగూడ శ్రీకర దవఖానాలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందాడు. దుర్గా ప్రసాద్ రావు ఈ సమాచారాన్ని భెల్ నేత్రదాన సంచాలకర్త, విజయ హాస్పిటల్ ఎండీ అల్లంపాండురంగారావు దృష్టికి తీసుకువచ్చారు. వారు కటుంబ సభ్యుల అనుమతితో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ వారితో మాట్లాడి నేత్రాలను(కార్నియ) దానం చేయించారు. ఈ సందర్భంగా అల్లం పాండురంగారావు మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యుడి నేత్రాలను దానం చేసి ఇతరుల కళ్లలో వెలుగు చూడాలనపకోవడం గొప్ప విషయం అన్నారు. సుబ్బారావు కుటుంబ సభ్యులను ఇతరులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సుబ్బారావు తనయుడు రామారావు, వారి కుటుంబ సభ్యులను అల్లం ప్రత్యేకంగా అభినందించారు.