నమస్తే శేరిలింగంపల్లి : ముస్లిం సోదర, సోదరీమణులకు, తమ బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు శేరిలింగంపల్లి బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు షాకీర్ తన కుటుంబ సభ్యులతో కలిసి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు తన నివాసంలో కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు.
అల్లానుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, సుఖశాంతులతో ఆనందంగా గడపాలని, ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండాలని కోరుకున్నారు.