నానక్ రామ్ గూడ లో పేద‌ల దుకాణాల‌ను కూల్చ‌డం ఆపాలి

  • డీసీ వెంక‌న్న‌కు కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్ విన‌తి

గ‌చ్చిబౌలి (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నానక్ రామ్ గూడ లో జిహెచ్ఎంసి అధికారులు రోడ్ డివైడింగ్ పేరుతో పేదల దుకాణాలను కూల్చివేయడం వెంటనే ఆపాలని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి అన్నారు. ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా దుకాణాలు కూల్చివేయడాన్ని వెంటనే ఆపాలని గురువారం శేరిలింగంపల్లి మున్సిపల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ వెంకన్నకి రవి కుమార్ యాదవ్ తో క‌లిసి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ.. నానక్ రామ్ గూడ లో మున్సిపల్ అధికారులు చేపట్టిన దుకాణాల కూల్చివేతల‌ను నిలిపివేయాలని కోరారు. డిప్యూటీ కమిషనర్ ఇందుకు సానుకూలంగా స్పందించారని కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించకుండా సమస్య పరిష్కరించాలని కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు, బాధితులు పాల్గొన్నారు.

డీసీ వెంక‌న్న‌కు విన‌తిప‌త్రం అంద‌జేస్తున్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి, ర‌వికుమార్ యాద‌వ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here