మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి ) : మహిళా సమాఖ్య భవన నిర్మాణానికి కృషి చేయాలని మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరీనగర్ కాలనీ వాసులు గురువారం కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్ ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ దృష్టికి తీసుకెళ్లి మహిళా సమాఖ్య భవనం నిర్మించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అనంతరం కార్పొరేటర్ ఉప్పల పాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తున్నదని, మహిళా సమస్యల పరిష్కానికి తమ వంతు కృషి చేస్తామన్నారు.