శేరిలింగంపల్లి, సెప్టెంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు చోట్ల ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి వి.జగదీశ్వర్ గౌడ్ గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్‌లో వినాయక మండపం వద్ద పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రఘునందన్ రెడ్డి, మిరియాల రాఘవరావు, కట్టా శేఖర్ రెడ్డి, అలీ, హరి కిషన్, సౌందర్య రాజన్, రషీద్, పృథ్వీ రాజ్ రెడ్డి, ప్రవీణ్, నందు యాదవ్, బబ్లూ, శ్యామ్, అమిత్ పాల్గొన్నారు.
అదేవిధంగా చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద కూడా జగదీశ్వర్ గౌడ్ ప్రత్యేక పూజలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి, సునీత రెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, రషీద్, సౌందర్య రాజన్, శివ, కృష్ణ, నర్సింగ్ రావు, సుధాకర్, ప్రవీణ్, కిరణ్, నవీన్, కిషోర్, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.