- కట్టడి చేయాలంటూ ప్రజాప్రతినిధులకు, పార్టీల నేతలకు విజ్ఞప్తి
- వినతి పత్రాలు అందించిన కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్
శేరిలింగంపల్లి, జనవరి 29 (నమస్తే శేరిలింగంపల్లి): జర్నలిస్టుల పేరుతో భవన నిర్మాణదారుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్న పార్టీ నాయకులను కట్టడి చేయాలని PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీని ఆయన నివాసంలో కూకట్‌పల్లి ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులకు డబ్బులు ఇవ్వాలని భవన నిర్మాణ దారులను బెదిరిస్తూ కొందరు పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాళ్ల వల్ల సమాజంలో జర్నలిస్టుల పట్ల చులకన భావం ఏర్పడుతుందని అన్నారు. మున్సిపల్ అధికారులు, కాలనీల సంక్షేమ సంఘం నేతలు సైతం జర్నలిస్టుల పేరు చెప్పి ఇళ్ల నిర్మాణదారులను భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇటు రాజకీయ నాయకులను, అటు అధికారులను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు.
జర్నలిస్టుల ముసుగులో ఎవరైనా వసూళ్లకు పాల్పడొద్దు : గాంధీ
సామాన్యులను ఇబ్బంది పెట్టే విధంగా జర్నలిస్టుల పేరుతో వసూళ్లకు ఎవరు పాల్పడినా సహించేది లేదని, ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తే లేదు అని, భవన నిర్మాణందారులను ఇబ్బంది పెట్టి వసూళ్ళ పేరుతో భయబ్రాంతులకు గురి చేయవద్దు అని, జర్నలిస్టు సంఘం మూకుమ్మడిగా అందరు కలిసి విజ్ఞప్తి చేయడం హర్షణీయమన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని PAC చైర్మన్ గాంధీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ యూనియన్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు గడ్డమీది బాలరాజు, యూనియన్ రాష్ట్ర నాయకులు తొట్ల పరమేష్, ఆర్కే దయాసాగర్, మామిడాల రవీందర్ రెడ్డి, నిమ్మల శ్రీనివాస్, కూకట్ పల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎంఏ కరీం, కార్యదర్శి రంజిత్ కుమార్, జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాణిక్య రెడ్డి, గంగరాజు, నవీన్ రెడ్డి, లక్ష్మణ్, సదా మహేష్, హరిబాబు, నజీర్, నాగరాజు, బంటు ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, చంద్ర, పవన్, తిరుపతి, భాస్కర్, నర్సింగరావు, వెంకట్రావు, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.