విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుంది: కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 14 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల హుడా కాలనీలో నల్లగండ్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ నల్లగండ్ల హుడా కాలనీ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐక్యమత్యంతో సోదర భావంతో అందరూ ఆనందంగా జీవించాలని అన్నారు. విఘ్నేశ్వరుని కరుణా, కటాక్షం ప్రజలపై తప్పక ఉంటుందన్నారు. ఆ గణనాథుడు ప్రతి మనిషి అజ్ఞానాన్ని తొలగించి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరారు.

వినాయ‌కుడి పూజ‌లో పాల్గొన్న కార్పొరేట‌ర్ గంగాధ‌ర్ రెడ్డి

హిందూ బంధువులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చిన ఉత్సవం వినాయక చవితి అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నదానం చేశారు. తదనంతరం లడ్డూ వేలం పాటలో పాల్గొని మొదటి లడ్డూను రూ.32,500 కు కైవసం చేసుకున్న నల్లగండ్ల హుడా కాలనీ వాసి ప్రకాశ్ రావుని, రెండో లడ్డూను రూ.73 వేలకు కైవసం చేసుకున్న నల్లగండ్ల హుడా కాలనీవాసి నవీన్ సాయికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షుడు జలేందర్ రెడ్డి, నల్లగండ్ల హుడా కాలనీ ఉపాధ్యక్షుడు రంజిత్ పూరి, ప్రధాన కార్యదర్శి భరత్, సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి, కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు రాజు నాయక్, శ్రీరాములు, ఆకాశ్ పూరీ, గోవర్ధన్, స్థానిక నేతలు, భక్తులు, మహిళలు, పిల్లలు, కాలనీ వాసులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here