అన్ని పార్టీలు క‌ల‌సి వ‌చ్చినా బీజేపీని ఏమీ చేయ‌లేవు: కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్

గ‌చ్చిబౌలి, సెప్టెంబ‌ర్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి పోటీ చేసినా బీజేపీని ఓడించడం అసాధ్యమని కేంద్ర సహాయక మంత్రి బండి సంజయ్ అన్నారు. బుధ‌వారం డివిజన్ ప‌రిధిలోని గౌలిదొడ్డిలో నిర్వ‌హించిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన‌తోపాటు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సామ రంగారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి రవి కుమార్ యాదవ్, కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా బండి సంజ‌య్ మాట్లాడుతూ ఎంఐఎం పార్టీని కార్పొరేషన్ ఎన్నికల్లో తరిమికొడతామ‌ని అన్నారు.

మ‌హిళ‌కు స‌భ్య‌త్వ న‌మోదు ప‌త్రాన్ని అంద‌జేస్తున్న కేంద్ర స‌హాయ మంత్రి బండి సంజ‌య్

ప్రపంచంలోనే బీజేపీకి అత్యంత ఎక్కువ మంది సభ్యులు ఉన్నారని అన్నారు. తాజాగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కష్టపడి మరింత మందిని సభ్యులుగా చేర్చాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఒకటేనని విమర్శించారు, కాంగ్రెస్ పార్టీని 6 గ్యారెంటీలను నమ్మి ప్రజలు ఓట్లు వేసి గెలిపించారని కానీ ఒక్క గ్యారంటీకి కూడా వారంటీ లేదన్నారు. రుణమాఫీ, బోనస్, రైతు భరోసా, మహిళలకు రూ.4 వేలు, తులం బంగారం, నిరుద్యోగ భృతి ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. 6 గ్యారెంటీల నుండి ప్రజల దృష్టిని మార్చేందుకు హైడ్రా అని హైడ్రామా ఆడుతున్నారని విమర్శించారు. చిన్నా చితక వారి మీద హైడ్రా ప్ర‌తాపం చూపుతుందని ముందు అలాంటి వాటికి అనుమతులు ఇచ్చిన వారి మీద కేసులు పెట్టాలని,పేదల మీద ప్రతాపం చూపెడుతున్న హైడ్రాకు వ్యతిరేకమని అన్నారు. హైడ్రా కాదు ముందు 6 గ్యారంటీల మీద దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు.

కార్య‌క్ర‌మంలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు

ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి తప్ప ఏ పార్టీకి సిద్ధాంతాలు లేవని అన్నారు. నేషన్ ఫస్ట్, మనం సెకండ్ అనేది బీజేపీ నినాదమని, బీజేపీ గెలవడం మనకంటే దేశానికి ఎక్కువ ముఖ్యమన్నారు. మొత్తం ప్రపంచం కన్ను ఇప్పుడు భారత్ మీద ఉందని, మోడీ నాయకత్వంలో అభివృద్ధి పథంలో ముందుకు వెళుతుందని, చైనా, అమెరికాలు భారత్ ఎదగవద్దని చూస్తున్నాయ‌ని అన్నారు. రానున్న అన్ని ఎన్నికల్లో అందరూ కలిసి నడవాలని కొత్త సభ్యులను పార్టీలో చేర్పించాలని అన్నారు. అలాగే ఎక్కువ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని సామ రంగారెడ్డి కోరారు.ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో బిజెపికి ఎదురులేదని, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీయే ప్రత్యామ్నాయమని తెలుపుతూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలాగా చేపట్టి రాష్ట్రంలోనే అత్యధిక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టి శేరిలింగంపల్లి నియోజక వర్గాన్ని భారతదేశ చరిత్రలో నిలిచేటట్టుగా కష్టపడి పని చేస్తామని పార్టీ పెద్దలకు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు రవీందర్రావు, నరేష్, రాఘవేంద్రరావు, మణిభూషణ్, మహిపాల్ రెడ్డి, అశోక్ కురుమ, నరేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు, బసంత్ యాదవ్, కృష్ణ ముదిరాజ్, శివ సింగ్, ఎల్లేష్, రాధాకృష్ణ, రాజు శెట్టి, బాలు యాదవ్, ఆంజనేయులు సాగర్, అశోక్, నరేందర్ రెడ్డి, హనుమంతు నాయక్, వరలక్ష్మి, పద్మ, మహేశ్వరి, మేరీ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here