నమస్తే శేరీలింగంపల్లి: ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతదేహం లభ్యమైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీ నగర్ వద్ద ఆదివారం నాడు సుమారు 60 నుంచి 65 సంవత్సరాల వయసుగల ఒక గుర్తు తెలియని మృతదేహన్ని గుర్తించారు. మృతుడు ఒంటిపై గులాబీ తెలుపు రంగు కలిగిన షర్టు, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, స్థానికంగా భిక్షాటన చేసేవాడు అయ్యి ఉండవచ్చని, అనారోగ్యంతో మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు చందానగర్ పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాలని సూచించారు.