మియాపూర్‌లో రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రి మృతి

మియాపూర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో సోమ‌వారం రెండు వేర్వేరు ఘ‌ట‌న‌ల్లో ఇద్ద‌రు రోడ్డు ప్ర‌మాదాల‌కు గురై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. పోలీసులు తెలిపిన ప్ర‌కారం వివ‌రాలు ఈ విధంగా ఉన్నాయి.

రెడీమిక్స్ లారీ ఢీకొని..
ఎం.న‌వీన్ కుమార్ (22) అనే ఐటీ ఉద్యోగి సోమ‌వారం ఉద‌యం 9.45 గంట‌ల‌కు త‌న మోటార్ సైకిల్ (ఏపీ23ఏఎన్‌1136)పై మియాపూర్‌లోని మంజీరా పైప్ లైన్ రోడ్డులో ఉన్న త‌న ఆఫీస్‌కు వెళ్తున్నాడు. ఈ క్ర‌మంలో మ‌దీనాగూడ సాయిరాం ట‌వ‌ర్స్ వ‌ద్ద‌కు రాగానే వెనుక నుంచి వేగంగా వ‌చ్చిన రెడీమిక్స్ లారీ (ఏపీ28టీఈ1119) అత‌ని వాహనాన్ని బ‌లంగా ఢీకొట్టింది. దీంతో న‌వీన్ తీవ్ర గాయాల‌కు గుర‌య్యాడు. అత‌న్ని స‌మీపంలో ఉన్న శ్రీ‌క‌ర హాస్పిట‌ల్‌కు చికిత్స నిమిత్తం త‌ర‌లించ‌గా అత‌ను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో అత‌ని కుటుంబ స‌భ్యుల‌కు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. లారీ డ్రైవ‌ర్ వేగంగా నిర్ల‌క్ష్యంగా వాహనాన్ని న‌డిపించ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంద‌ని పోలీసులు తెలిపారు.

మ‌రో సంఘ‌ట‌న‌లో…
మ‌దీనాగూడ‌లోని ఆర్‌టీసీ కాల‌నీకి చెందిన చిన్న అప్పారావు (38) పని నిమిత్తం బ‌య‌ట‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలో ప‌ని ముగించుకుని ఇంటికి త‌న ద్విచక్ర వాహ‌నం (టీఎస్07జీవీ2625)పై వ‌స్తుండ‌గా మ‌దీనాగూడ‌లోని పైప్‌లైన్ రోడ్డులో ఉన్న క‌ల్లెం అంజిరెడ్డి స్కూల్ వ‌ద్ద ప్ర‌మాద‌వ‌శాత్తూ వాహనాన్ని డివైడ‌ర్‌కు ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో అత‌ని త‌లకు తీవ్ర‌గాయాలు కాగా అత‌న్ని చికిత్స నిమిత్తం శ్రీ‌క‌ర హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. హాస్పిట‌ల్ లో అత‌ను చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

చిన్న అప్పారావు(ఫైల్)
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here