హోటల్ రాడిసన్ లో ఆక‌ట్టుకుంటున్న‌ పోచంప‌ల్లి చీర‌ల క్రిస్మ‌స్ ట్రీ

మాదాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): హైదరాబాద్ లోని  రాడిస‌న్ హైటెక్ సిటీ హోట‌ల్ ప్రాంగ‌ణంలో పోచంప‌ల్లి చీర‌ల‌తో క్రిస్మ‌స్ ట్రీని ఏర్పాటు చేశారు. రూ.26 ల‌క్ష‌లు విలువైన మొత్తం 40 చీర‌ల‌ను ఉప‌యోగించి క్రిస్మ‌స్ ట్రీని వారు అందంగా ముస్తాబు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆ ట్రీని మంజీరా గ్రూప్ చైర్మ‌న్ యోగానంద్ దంప‌తులు ముఖ్య అతిథులుగా హాజ‌రై ఆవిష్క‌రించారు.

క్రిస్మ‌స్ ట్రీని ఆవిష్క‌రించిన మంజీరా గ్రూప్ చైర్మ‌న్ యోగానంద్ దంప‌తులు

ఈ సందర్భంగా రాడిస‌న్ హోట‌ల్ జీఎం ప‌వ‌న్ కుమార్ మాట్లాడుతూ లోక‌ల్ ఫ‌ర్ వోక‌ల్ అనే నినాదానికి అనుగుణంగా పోచంప‌ల్లి చీర‌ల‌కు అంత‌ర్జాతీయ స్థాయిలో ప్ర‌చారం క‌ల్పించేందుకే ఆ చీర‌ల‌తో ఇలా క్రిస్మ‌స్ ట్రీని అలంక‌రించి ప్ర‌ద‌ర్శ‌న‌కు ఉంచామ‌ని తెలిపారు. కాగా సంద‌ర్శ‌కుల‌ను ఆ క్రిస్మ‌స్ ట్రీ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

పోచంప‌ల్లి చీర‌ల‌తో క్రిస్మ‌స్ ట్రీని అందంగా ముస్తాబు చేసిన దృశ్యం
క్రిస్మ‌స్ ట్రీ వ‌ద్ద శాంతా క్లాజ్ దుస్తుల్లో సంద‌డి చేస్తున్న యువ‌తులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here