జేపీ నగర్‌లో పారిశుధ్య తనిఖీలు.. నిల్వ నీటి తొలగింపునకు అధికారుల చర్యలు

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 27 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): మియాపూర్ సర్కిల్ పరిధిలోని జేపీ నగర్ (హెచ్‌డీఎఫ్‌సీ) ప్రాంతంలో పారిశుధ్య తనిఖీలు, నిల్వ నీటి తొలగింపు చర్యలు చేపట్టారు. డీవైఈఈ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ (SWM) విభాగం, ఇంజినీరింగ్ అధికారులు, ఏసీపీ ట్రాఫిక్ పోలీస్, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) బృందాలు, ఇతర సంబంధిత సిబ్బంది సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు పారిశుధ్య నిర్వహణను మెరుగుపరిచేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రజారోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ వివిధ శాఖల అధికారులు సమన్వయంతో విధులు నిర్వహించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here