శేరిలింగంపల్లి, నవంబర్ 27 (నమస్తే శేరిలింగంపల్లి): సమయస్ఫూర్తితో స్పందించిన గచ్చిబౌలి పోలీసులు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (HCU) విద్యార్థి ప్రాణాలను కాపాడారు. స్నేహితుడు సూసైడ్ నోట్ రాసి కనిపించడం లేదని డయల్-100కు ఫిర్యాదు అందడంతో పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. శుక్రవారం అందిన సమాచారం మేరకు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లోని ఎల్ మెన్ హాస్టల్‌కు చేరుకున్నారు. అక్కడ మూడో అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నిస్తున్న 21 ఏళ్ల అభినవ్ లక్రా అనే విద్యార్థిని గుర్తించి, సకాలంలో అడ్డుకుని రక్షించారు. అనంతరం తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న విద్యార్థిని యూనివర్సిటీ వెల్ఫేర్ టీమ్‌కు అప్పగించారు. విద్యార్థికి కౌన్సెలింగ్ అందించడంతో పాటు, తదుపరి సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టారు. సకాలంలో సమాచారం అందించడం, పోలీసులు వేగంగా స్పందించడం వల్ల విద్యార్థి ప్రాణాలు కాపాడగలిగారు.





