దీపం వెలిగిస్తుండగా ప్రమాదవశాత్తు మంటలు.. తీవ్ర కాలిన గాయాలతో చికిత్స పొందుతూ మహిళ మృతి

శేరిలింగంప‌ల్లి, న‌వంబ‌ర్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): దీపం వెలిగిస్తున్న స‌మ‌యంలో ప్ర‌మాద‌వ‌శాత్తూ మంట‌లు అంటుకుని తీవ్ర గాయాల పాలై హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ ఓ మ‌హిళ మృతి చెందిన సంఘ‌ట‌న చందాన‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. న‌ల్ల‌గండ్ల‌లోని త్రిశాల సాఫ్రాన్‌లో బి.ల‌క్ష్మి (55), త‌న భ‌ర్త శేషాచార్యులు, కుమార్తె హ‌రిచంద‌నతో క‌లిసి జీవిస్తోంది. ల‌క్ష్మి మ్యూజిక్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, ఆమెకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. న‌వంబ‌ర్ 9న సాయంత్రం కింటి కారిడార్‌లో దీపం వెలిగిస్తున్న స‌మ‌యంలో ల‌క్ష్మికి ప్ర‌మాద‌వ‌శాత్తూ మంట‌లు అంటుకున్నాయి. దీంతో ఆమె తీవ్రంగా కాలిన గాయాల‌కు గుర‌వ్వ‌గా, ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న సిటిజ‌న్స్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స చేసిన అనంత‌రం ఆమెను వైద్యుల సూచ‌న మేర‌కు మెరుగైన చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌లోని కేర్ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆమె చికిత్స పొందుతూ శుక్ర‌వారం మృతి చెందింది. ఈ మేర‌కు మృత‌దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిట‌ల్‌కు త‌ర‌లించిన పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here