శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను పురస్కరించుకుని అయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు చీరలు, దుస్తులను పంపిణీ చేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి. రోహిత్ ముదిరాజ్ నేతృత్వంలో మొత్తం 40 కుటుంబాలకు చీరలు, దుస్తులను అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు జి. రోహిత్ ముదిరాజ్ మాట్లాడుతూ.. నిరుపేద కుటుంబాలకు అండగా నిలిచి, సేవా కార్యక్రమాలు నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయువ్ స్టూడెంట్స్ యూత్ ఫౌండేషన్ సభ్యులు స్వరూప్, కలీమ్, వసంత్, మహేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.






