మయూరి నగర్‌ ARK టవర్స్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 12 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ డివిజన్ పరిధి మయూరి నగర్‌లో ఉన్న ARK టవర్స్ అపార్ట్‌మెంట్స్‌లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అపార్ట్‌మెంట్స్‌ నివాసితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు మియాపూర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తన సతీమణి ఉప్పలపాటి సుమలతతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప్పలపాటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, రాష్ట్ర సంస్కృతి సంప్రదాయాలకు, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే ఈ పండుగ మహిళల ఐక్యతకు, కుటుంబాల మధ్య అనుబంధాలకు, సామాజిక సమైక్యతకు ప్రతిబింబమని పేర్కొన్నారు.

తరతరాలుగా వస్తున్న తెలంగాణ సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో బతుకమ్మ వేడుకలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. మయూరి నగర్‌లోని ARK టవర్స్ అపార్ట్‌మెంట్స్ వాసులు కలిసికట్టుగా బతుకమ్మ వేడుకలను నిర్వహించడం సంతోషకరమని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఈ పండుగ ప్రతి ఒక్కరి ఇంటా సంతోషాలు, సిరిసంపదలు, సుఖసంతోషాలు నింపాలని శ్రీకాంత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ARK టవర్స్ అపార్ట్‌మెంట్స్‌కు చెందిన మహిళలు, నివాసితులు, అసోసియేషన్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here