శేరిలింగంపల్లి, అక్టోబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లిలోని దీప్తిశ్రీనర్ కాలనీలో స్ట్రీట్ వెండార్స్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) మియాపూర్ సర్కిల్ ఉప కమిషనర్ శ్రీనివాస్‌కు సోమవారం సీపీఎం జోన్ కార్యవర్గ సభ్యుడు కొంగరి కృష్ణ ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ మియాపూర్ సర్కిల్ పరిధిలో స్ట్రీట్ వెండార్లు ఎన్నో సంవత్సరాలుగా ఉపాధి కోసం చిరు వ్యాపారం చేస్తున్నారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారికి ముద్ర లోన్స్ ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నాయని అన్నారు. కానీ దీప్తిశ్రీనగర్‌లోని స్ట్రీట్ వెండార్లను ట్రాఫిక్ సమస్య వస్తుందని అధికారులు చెప్పడంతో హుండాయి షోరూం వెనుక వ్యాపారం చేసుకోవాలని చెప్పారని అన్నారు. ప్రస్తుతం రోడ్డును నిర్మిస్తున్నారని, దీంతో చిరు వ్యాపారులు మళ్లీ ప్రధాన రహదారి పక్కకు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణం పూర్తయిందని, అందువల్ల అక్కడే వ్యాపారం చేసుకోవడానికి సహకరించాలని కోరారు. లేదంటే చిరు వ్యాపారులకు అదే ప్రాంతంలో మరో చోట స్థలం కేటాయించాలని కోరారు.






